పర్సనాలిటీ గురించి రెస్యూం రాయటం గురించి, మీకు కావలసిన సలహాలు…

పర్సనాలిటీ  గురించి మీ కు కావలసిన సలహాలు

సాధారణంగా పర్సనాలిటీ అనగానే లావు పొడుగు అందమూ అనేవి మనస్సు లోకి వస్తాయి.
మనిషి యొక్క అందం ఒక్క మనిషి రూపం లోనే వుండదు. ఆతని హావ భావాలు, నడిచే తీరూ మ్యానర్స్, ఇవన్నీ పరిగణన లోనికి వస్తాయి. మీరు నల్లగా వుండచ్చు, పొట్టిగానూ కురచ గానూ లేదా తలకొంచెం నెరిసి గాని క్రాఫింగు సరిగా లేక గాని ఉన్నా – మీరు వీటి గురించి అనవసరముగా ఆలోచంచనక్కరలేదు. భగవంతుడు ( ఆయన్ని ఏపేరు పెట్టి పిలిచినా సరే) అందరికీ అన్నీ సమకూర్చడు. ఏదొ ఓక లోటు ఉంటుంది. ఆ లోటుని కప్పి ఉన్న మంచిని బయటకు చూపించటమే ఒక యుక్తి.

సమయానుకూలంగా సమయోచితంగా, తానొవ్వక మరొకరిని నొప్పించక నదచుకు రావటమనేది ఒక గొప్ప పర్సనాలిటి. ఈది మనం డెవలెప్ చేసుకున్నపుడు మనకున్న మైనస్ విషయాలు వీక్నెస్లు అన్ని కూడా బయటికి కనిపించవు.

మీరింకా తెలుసుకొవాలనుకుంటే జుబ్రం డాట్ కాం కి వెళ్ళండి

ఇంటర్వూలలో సాధారణంగా మనం చెసే తప్పులు ఏమిటి?
1. నీ గురించి నీకు పూర్తిగా తెలియకపోవటమే ఒక పెద్ద తప్పు – అనగా నీ ప్లస్ పాయింట్లు ఏమిటి మైనస్ పాయింట్లు ఏమిటి అన్నవి నీవే గ్రహించి ( అవి అన్నీ రెస్యూం లో రాయకూడదు) వాటిని మనకున్న తెలివితో మంచిని బయటికి చూపించి తక్కువదనాన్ని దాచొకోవడం లో నే మన తెలివి. అది ఏలాగా? ఏలా సాద్యం? ( ఈ విషయాలు తర్వాత మాట్లాడుదాం.)

2. ఇంటర్వూ రూం లోకి వెళ్ళగానే భయంతొ గానీ చిలిపితనంతొ గాని, కుర్ర తనం తొగాని, పొగరు, ఈగొ తొ గాని మన నడక, చూపులు, నవ్వు, ద్వారా బయటికీ తెలుస్తాయి. నీమీద నీకున్న కాన్-ఫిడెన్సు నీవు వెళ్ళగానె ఇచ్చే షేక్ హ్యండ్ గాని ఆతీరులో గాని, చేతి చెమట గాని నీ సంగతి అర్ధమయి పోతుంధి.

3. ముఖ్యం గా మానేజర్ వేసిన ప్రశ్నను పూర్తిగా వినకపొవటం, విని అర్ధమవకపొవడం – అలా అర్ధమవకపోయినా – తిరిగి అడగక పోవటం, తెలియనిది తెలియదు అని చెప్పె దైర్యం లేకపోవటం.

4. నిజానికి మీరు ప్రశ్నను విన్నా సగం విన్నా – మళ్ళీ ఒకసారి చెప్పండి – అనడిగితే మీకు ప్రశ్నకు సమాధానం ఆలోచంచుకోడానికి సమయం దొరుకుతుంది.

5. కొన్ని కొన్ని సమయాల్లొ కొంచెం సమయం అయినతర్వాత మీరు మీఅంతట అడగ గలిగితే అది ఒక పేద్ద పాజిటివ్ పాయింటు.

6. మీ సొంత వ్యక్తిగత విషయాలు అనవసరంగా – ఉదాహరణకి : మీకు ఈ జాబు తొందరగా రావలసిన అవసరం గాని, ఎందుకు మీరు పాత కంపనీ వదిలేసారని కాని, అక్కడున్న విషయాలు దాచుకోకుండా చెప్పడం కూడా మంచిదికాదు. ఏప్పుడూ కూడా పాత ( వదిలేసిన) కంపెనీ గురించి చెడుగా మాట్లాడకూడదు.

7. మీరు వేసుకున్న దుస్తులు, వాటి తీరు, రంగూ, ఇవి కూడా చాలవరకూ నెగెటివ్ గా మీ మీద రావచ్చు.

( మీకు ఎవేనా సందేహాలు ఉంటె నాకు రాయచ్చు – నా ఈ మెయిల్ జుబ్రం ఎట్ జీమెయిల్ డాట్ కాం.)

This blog has been modified as web site click on the below link

go to http://www.zubram.com

రెస్యూం రాయటం ఏలా? అందులొ ఉన్న సమస్యలు ఏమిటి?

రెస్యూం అన్నా  సీ వీ అన్నా బయొడాటా అన్నా అన్ని ఒకటె. రెస్యూం అనగా మీరు ఎలాంటి వారు, ఏంచదువుకున్నారు అని మీ గురంచి చెప్పేది రెస్యూం. అలా అన్నాను కదా అని, మీ ఎత్తు పొడుగూ లావూ రంగూ అన్నీ చెప్పక్కర లేదు. రెస్యూం అన్నాక అది మీరు మీ ఇష్తాను సారం మీ రెస్యూం పంపుతున్నట్లు  అది కూడా ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటె మీకు ఏ సమస్య లేకపోతె మీరు అక్కడ ఉద్యొగం చేయటానికి ఒప్పుకొగలరని అని మీ ఉద్దేశాన్ని తెలిపే పత్రం.

మీరు ఇంఫర్మెషన్ టెక్నాలజీ లో మాస్టర్ అవచ్చు, ఎం సి ఎ ఫస్ట్ క్లాస్ రావచ్చు అంతమాత్రాన మిమంల్ని పిలిచి ఎవరూ ఉద్యొగం ఇవ్వరు కదా. అంధుకని ఒక వినూత్న మయినది స్వంతంగా రాయబడినది అందులోను మీరు మీగురించి మీరే రాసినది అయితే అది ఎంత అందంగా ఉంటుందో ఆలోచిచండి.

ఓక సంగతి చెపుతాను. మీరు ఎప్పుడూ అందరికంటే చాలా బావుండాలనీ ప్రత్యెకంగా ఉండాలనీ అనుకోవటం సహజం కదా . అల్లాగే మీ రెస్యూం కూడా ప్రత్యేకంగా ఉండాలని ఎందుకనుకోరు?

20 ఏళ్ళ క్రితం పొస్ట్ కార్డులమీద అప్లికేషను రాసి పంపేవారు కొంతమంది. మరికొంతమంది ఇన్లాండు కవరు మీద రాసి పంపేవారు. అవి చూడగానే ప్రక్కకు తోసేశావారు. ఊద్యొగాలకోసం కొంచెం కూర్చుని పేపరు కొని రాయటానికి తీరుబడి లేనివారు ఊద్యొగం ఎలా చేస్తారనేది ప్రశ్న. ఆలాగే ఈ రోజుల్లో కొంతమంది ప్రక్కనే ఉన్న కిరాణా కొట్టులో బయొ డాటా ఫారం కొని అది నింపి అది తీసికెళ్ళి ఇచ్చేస్తారు. దాన్ని ఎవరూ చూడరు.
చాలామంది ఫ్రెష్ గా ప్యాసయిన వాళ్ళు తిన్నగా నెట్ లోకి వెల్లి అక్కడ ఉన్న యజమానిని రెస్యూం రాసి ప్రింట్ చేసి ఇమ్మంటారు. అదే తీసికెళ్ళి మైల్ లో పంపేస్తారు. లేదా నెట్లోంచి దవున్లోడ్ చేసి పేరు మార్చి పంపుతారు. 

చదువుకున్న వాళ్ళు, టాప్ స్తైల్ లొ ఉండేవాళ్ళు రెస్యూం విషయంలో చేసే కొన్ని తప్పులు:
మీ పేరుముందు మిస్టర్ అని రాయకూడదు.
రెస్యూం పైన – హెడ్డింగ్ లాగ – సి.వీ అనీ, బయొడాటా అనీ బ్లాక్ లెటర్సులో పెద్ద అక్ష రాలలో పెడతారు. ఇది అనవసరం. మీపేరు మామూలు టైపు లో రాస్తె చాలు.
మీ చిరునామా పూర్తిగా రాయక్కరలేదు. అది, సెలెక్ట్ అయినతర్వాత వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ లో రాసి తీరాలి.
ఒక్కటే ఈ మైల్ ఇవ్వండి, ఉందికదాని 2 లేక 3 ఇవ్వకూడదు.
ఒక్కటే మొబైల్ నంబర్ ఇవ్వాలి లేదా మరొక ల్యాండ్ లైన్ నంబర్ ఇవ్వవచ్చు.

ఆబ్జెక్టివ్ అనేది రాయవద్దు. ఇది చలా పాతపద్దతి అయిపోయింది. కనుక రాస్తె బావుండదు.
అంతకన్న “నా గురించి” అని కాని, లేదా ” ముందుమాట” లాగ కాని “యబొట్ మి” అని సబ్ హెడ్డిగ్ పెట్టి ఒక నాలుగు లైన్లలొ మీ గురించి యుక్తి గా రాయవచ్చు. నిజానికి ఇక్కడ ఏమి రాసారొ, ఎలా రాస్తారొ దాన్ని బట్టి మీ ఇంటర్వ్యూ నడుస్తుంది. ఈ మద్య ఒక అమ్మాయి, కొంచం అనుభవం ఉన్న అమ్మాయి, యబౌట్ మి అని రాసి దాని క్రింద ఏకంగా కవరింగ్ లెటర్ లాగ ఒక్క అయిదు లైన్లలో రాశి పంపించింది, చక్కని రెస్పాన్స్ వచ్చింది. మీరు వినూత్నంగా వుండాలనుకుంటారు మీ రెస్యూం మాత్రం గాలికి వదిలేస్తారు. ఏ విషయంలోనూ రెస్యూం దగ్గిర రాజి పడకండి.

ఇక మీ చదువు విషయాలు రాశేటప్పుడు, అనగా ఏడ్యుకేషన్ / క్వాలిఫికేషన్ – మీరు కనక ఎం బి ఏ కానీ బీ టెక్ కానీ ఎం సి ఏ కానీ అయితేనూ తాజా గా కాలేజీనుంచి బయటకు వచ్చిన వాళ్ళు తప్ప మిగతావారు క్లాస్ టెన్ నుంచి మార్కులు పరసెంటేజీలు ఇవ్వనక్కరలేదు. ధైర్యం ఉంటె తాజా వాళ్ళూ ఇవ్వక్కరలేదు. అడిగితే అప్పుదు చూద్దాం.

తండ్రి పేరు, తాత పేరు, తండ్రి ఉద్యొగ వివరాలు, నేషనాలిటి, పెళ్ళైందా లేదా, పాసుపోర్ట్ నంబరూ మరియూ పుట్టిన తేది ఇవన్నీ వద్దు. పేజీలు నింపవద్దు. మీ వీక్నేస్ బలాలు హాబిలు రాయకండి. వాటివలన అనవసరపు సమస్యలు ఎదురవవచ్చు. అన్నీ ఇపుడె అందులో రాశెస్తె చెప్పటానికి ఏమీ మిగలదు.ఒక్క వయస్సు రాయండి. చాలమంది ఒక డిక్లరేషను ఇస్తూ ఉంటారు దానిక్రింద సంతకం పెడతారు. ఆది రాసినా అలా డిక్లరేషన్ ఇచ్చినా మీకు రెస్యూం రాయటం లో శ్రద్ధ లేదని వాళ్ళకి తెలిసి – మిమ్మల్ని అతిసాధారణంగా చూస్తారు.

మీకేవయినా సందేహాలునా సలహాలు కావాలన్నా నాకురాయచ్చు. నా మైల్ అయిడీ జుబ్రం డాట్ కాం లో ఉంది. మీరు కావానుకుంటె నాఫోన్ నంబరు కూడా తీసుకోవచ్చు. అడగండి.

 ( ఇంకా వుంది )

Tagged , , , , , , , , , , ,
Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: